కొన్ని సినిమాలు చూసిన కొన్ని రోజులతర్వాత కూడా పాత్రలు కాని,సన్నివేశాలు కాని మన మనసులో ఏదో ఒక సమయంలో గుర్తుకు వస్తుంటే అటువంటి సినిమాలు మంచి సినిమాలు. ఇప్పుడు అటువంటి మంచి సినిమాలు కొన్ని తెలుసుకుందాం.
1 ) లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ :
ఇది ఒక ఇటాలియన్ సినిమా. మనసును గిలిగింతలు పెడుతూనే కళ్ళను చేమర్చేలా చేస్తుంది. "లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ " రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నసమయంలో జరుగుతుంది. ఒక తండ్రి తన కుమారుడితో పాటు సైన్యం చేతిలో బందీలుగా ఉంటారు. ఆ విషయం చెప్పకుండా మనం ఒక ఆట ఆడుతున్నాం, మనం గెలిస్తే యుద్ద ట్యాంకర్ ఇస్తారని చెప్పుతాడు. తన కుమారుడుకి తను అనుభవిస్తున్న కష్టాలను కూడా నవ్వుతూ ఇదంతా ఆటలో ఓ భాగం అని చెపుతాడు. చివరికి సైన్యం చేతిలో తను మరణించిన తన బిడ్డను తల్లి దగ్గరకు చేరుకునేటట్లు చేస్తాడు.
ఈ సినిమాలో మొదటి భాగం హీరో,హీరోఇన్ల ప్రేమ కథ చాల బాగుంటుంది. కాని తండ్రి కొడుకల మధ్య ఉండే ప్రేమ,ఆప్యాయత రెండవ భాగంలో ఉండి మనల్ని మనం ప్రేమించడం నేర్చుకుంటాం,కష్టకాలంలో కూడా ఎలా ఉండవచ్చో అన్న విషయం తెలుస్తుంది.

No comments:
Post a Comment